: ఆదివారం చంద్రబాబును కలసిన పవన్
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కొత్త స్నేహాలు చిగురిస్తున్నాయి. ఈ నెల 14న (శుక్రవారం) జనసేన పార్టీని అధికారికంగా లాంచ్ చేసిన పవన్ కల్యాణ్ తదుపరి కార్యాచరణలో బిజీ అయిపోయారు. కాంగ్రెస్ ను తరిమికొట్టే పార్టీలతో చేతులు కలుపుతున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన ఆదివారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సమాచారం ఆలస్యంగా వెలుగు చూసింది. జనసేన ప్రారంభ ప్రసంగంలో కూడా చంద్రబాబును పవన్ మెచ్చుకోవడం తెలిసిందే. చంద్రబాబుతో పవన్ భేటీ అయిన నేపథ్యంలో, వీరి భవిష్యత్ కార్యాచరణ ఏవిధంగా ఉండబోతుందో ఊహించుకోగలం.