: దోపిడీ కోసమే హిమబిందును హత్య చేశారు


విజయవాడలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజర్ సాయిరాం భార్య హిమబిందు హత్య కేసు మిస్టరీ వీడింది. నగదు, నగలు కోసమే హిమబిందును ఆగంతుకులు దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

స్నేహితులతో కలిసి క్యాబ్ డ్రైవర్ సుభానీ ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. హిమబిందును ఇంట్లోనే హతమార్చిన అనంతరం నిందితులు మృత దేహాన్ని అదే ఇంటిలో రెండు రోజులు ఉంచారు. తర్వాత మృత దేహాన్ని తీసుకెళ్లి బందరు కాల్వలో పడేశారు. కేసు నమోదు చేసుకున్న విజయవాడ పోలీసులు నిందితులు సుభానీ, కృష్ణ, గోపీ, రమణలను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News