: ఇద్దరు మిత్రుల మధ్య నలుగుతున్న బీజేపీ
తమిళనాడులో బీజేపీ ఊహించని ఇబ్బందిని ఎదరుర్కొంటోంది. రానున్న ఎన్నికల్ల నేపథ్యంలో తనతో జత కట్టిన డీఎండీకే, పీఎంకేలకు సీట్లు కేటాయించే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. నటుడు విజయకాంత్ కు చెందిన డీఎండీకేకు 14 లోక్ సభ స్థానాలను (మొత్తం స్థానాలు 39) బీజేపీ కేటాయించింది. అయితే ఇక్కడే బీజేపీకి చిక్కొచ్చి పడింది. డీఎండీకేకి కేటాయించిన కొన్ని స్థానాలు తనకే కావాలంటోంది పీఎంకే. అయితే పీఎంకే కంటే డీఎండీకేకే ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉండటంతో... పీఎంకే డిమాండ్లను బీజేపీ ఎక్కువగా ఖాతరు చేయడం లేదు. ఇదే సమయంలో పీఎంకే మనసు గాయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.