: నలభై ఏళ్ళు దాటిన మహిళా పోలీసులకు చీరలు!


ముంబయిలో ఇకపై మహిళా పోలీసులకు చీరలు ధరించే వెసులుబాటు కలగనుంది. అయితే, 40 ఏళ్ళు పైబడినవాళ్ళకేనట. ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ముంబయి కమిషనర్ రాకేశ్ మారియా మహిళా పోలీసు సిబ్బందితో సమావేశమయ్యారు. వారి కష్టనష్టాలను ఓపికతో విన్నారు. ఇది బహిరంగ చర్చ లాంటి కార్యక్రమమని, వారి సూచనలను, సలహాలను తాము స్వీకరించామని మారియా తెలిపారు. చీరలకు సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News