: తప్పిపోయిన విమానంలోని ప్రయాణికుల మొబైల్స్ రింగవుతున్నాయి..?


మలేసియా విమానం అదృశ్యమై 11 రోజులవుతోంది. ఇంతవరకూ జాడ లేదు. 20కిపైగా దేశాలు అన్వేషిస్తూనే ఉన్నాయి. అయితే, ఆ విమానంలోని ప్రయాణికుల మొబైల్స్ రింగవుతుండడం వారి కుటుంబసభ్యుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఓ చైనా వ్యక్తి విమానంలోని తన సోదరుడి మొబైల్ కు కాల్ చేయగా రింగవుతూ వినిపించింది. దీనిని అతడు ఓ టీవీ చానల్ కు ప్రత్యక్షంగా చూపించాడు. కొన్ని సార్లు రింగయ్యాక అది డిస్ కనెక్ట్ అయిపోయింది. అలాగే, ఇతర ప్రయాణికులకు సంబంధించిన 19 కుటుంబాల వారు కూడా తమ వారి మొబైల్స్ రింగవుతున్నాయని, కానీ జవాబు లేదంటూ మలేసియన్ ఎయిర్ లైన్స్ సిబ్బంది దృష్టికి తెచ్చారు. దాని ప్రకారం విమానం లొకేషన్ గుర్తించాలని కోరారు.

రింగవుతున్నంత మాత్రాన మొబైల్స్ పనిచేస్తున్నట్లు కాదని నిపుణులు అంటున్నారు. కాల్ ను కనెక్ట్ చేసే వరకు నెట్ వర్క్ లు అలా రింగవుతున్నట్లు చూపిస్తాయని పేర్కొంటున్నారు. ఏ నంబర్ కైనా కాల్ చేసినప్పుడు సదరు నంబర్ ను వెంటనే క్యాచ్ చేయలేకపోతే.. మరింత పరిధిలో దాని కోసం అన్వేషణ జరుగుతుందని, దీనికి కొన్ని సెకన్ల సమయం పడుతుందని, అప్పటి వరకు నెట్ వర్క్ లు కాలర్స్ ను లైన్లోనే ఉంచేందుకు రింగ్ వినపడేలా చేస్తాయని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News