: ముంబై ఎన్నికల బరిలో ప్రియాదత్, పూనం మహాజన్
ముంబై నార్త్ సెంట్రల్ బరిలో సిట్టింగ్ ఎంపీ ప్రియాదత్ పై పోటీగా పూనం మహాజన్ ను దింపాలని బీజేపీ నిర్ణయించింది. ప్రియాదత్ దివంగత కాంగ్రెస్ నేత సునీల్ దత్ కూతురు కాగా, పూనం దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ కుమార్తె. 2009 ఎన్నికల్లో ఇక్కడ 1.77 లక్షల ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన ప్రియాదత్ పై పోటీకి నటుడు నానాపటేకర్, మాజీ ఐపీఎస్ సత్యపాల్ సింగ్ పేర్లు పరిశీలించినా... చివరకు బీజేపీ పూనం వైపు మొగ్గు చూపింది.
యూపీఏ చేసిన అభివృద్ధి, ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని కాంగ్రెస్ ఎంపీ ప్రియాదత్ ధీమాగా ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని పూనం చెబుతోంది.