: హైదరాబాద్ విచ్చేసిన కేంద్ర హోంశాఖ బృందం


కేంద్రం హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి నేతృత్వంలోని బృందం హైదారాబాద్ విచ్చేసింది. విభజన నేపథ్యంలో జరుగుతున్న పలు అంశాల నివేదికలను ఈ బృందం పరిశీలిస్తుంది. ఈ రోజు సచివాలయంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో వీరు భేటీ అవుతారు. ఉద్యోగుల పంపిణీ నుంచి కొత్త రాజధాని వరకు 15 కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర బృందం ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు గవర్నర్ నరసింహన్ తో, 3.30 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోను భేటీ అవుతుంది.

  • Loading...

More Telugu News