: కాంగ్రెస్ టిక్కెట్ పై ఎవరూ పోటీ చేయాలనుకోవడం లేదు: శివసేన


లోక్ సభ ఎన్నికలకు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే టిక్కెట్ పై ఎవరూ పోటీ చేయాలనుకోవడం లేదని శివసేన వ్యాఖ్యానించింది. పార్టీ పత్రిక 'సామ్నా'లో రాసిన సంపాదకీయంలో ఈ మేరకు ఎద్దేవా చేసిన శివసేన.. దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పేర్కొంది. ఇప్పటికే రంధ్రాలు పడ్డ బెలూన్ కు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గాలినింపే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పై వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. రెండు వందల సీట్లకు పైగా గెలుచుకుంటామని చెబుతున్న పార్టీకి, ఎన్నికల్లో నిలబడడానికి అసలు అభ్యర్థులే దొరక్కపోవడం హాస్యాస్పదం అంటూ చురకలేసింది.

  • Loading...

More Telugu News