: పాలకొల్లులో యువతిపై అత్యాచారయత్నం
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నలుగురు యవకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారయత్నం చేశారు. పశువుల ఆస్పత్రి వద్ద నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. యువకులు అత్యాచార యత్నం చేస్తుండగా ఆమె గట్టిగా అరవడంతో స్థానికులు వచ్చి కాపాడారు. ఈ లోపు కామాంధులు పరారయ్యారు. యువతికి గాయాలు కాగా, ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.