: బాలయ్య గురి ఎటు?


ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ ఈ ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? లేక ఎంపీగా పోటీ చేస్తారా? అందరి మదినీ తొలుస్తున్న ప్రశ్నలివి. గత ఎన్నికల సమయంలో టీడీపీ తరపున ప్రచారం చేసినప్పటికీ... ఇప్పటిదాకా బాలయ్య ఒక్కసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ, ఈసారి మాత్రం ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని నిశ్చయించుకున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇప్పటిదాకా టీడీపీ కొన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేయలేదు.

ఒకవేళ బాలయ్య ఎమ్మెల్యేగా పోటీ చేస్తే... అనంతపురం జిల్లా హిందూపురం స్థానం, లేకపోతే కృష్ణా జిల్లా గన్నవరం, పెనమలూరులో ఏదో ఒక స్థానం నుంచి బరిలోకి దిగుతారని సమాచారం. ఎంపీగా పోటీ చేయాలనుకుంటే హిందూపురం లేదా విజయవాడ లోక్ సభ స్థానాల్లో ఏదైనా ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. అయితే, ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా హిందూపురం నుంచే పోటీ చేయడానికి బాలయ్య ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా అభిమాన సంఘం నేతలు తనను కలసినప్పుడు... హిందూపురం రాజకీయ పరిస్థితులపై వారితో బాలయ్య చర్చించారు. దీంతో, ఆయన ఎక్కువ శాతం హిందూపురం నుంచే ఎన్నికల బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News