: శ్రీవారిని దర్శించుకున్న మోహన్ బాబు
సినీనటుడు మోహన్ బాబు ఈ రోజు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కుమార్తె లక్ష్మీప్రసన్న, కుమారులు విష్ణు, మనోజ్ లతో కలసి ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు. రేపు మెహన్ బాబు పుట్టిన రోజు కావడంతో... వీరు ఈ రోజు స్వామి వారి ఆశీస్సుల కోసం విచ్చేశారు. ఆలయ డిప్యూటీ ఈవో రమణ వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.