: చెన్నై మ్యాచులకు లంక ఆటగాళ్లను అనుమతించొద్దు: ప్రధానికి జయలలిత లేఖ


శ్రీలంక తమిళుల వ్యవహారంపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తాజాగా చెన్నయ్ లో ఐపీఎల్ మ్యాచుల నిర్వహణ గురించి ప్రధానికి లేఖ రాశారు. ఈసారి ఐపీఎల్ సీజన్ లో చెన్నై వేదికగా జరిగే మ్యాచుల్లో శ్రీలంక ఆటగాళ్లు ఆడేందుకు అనుమతి ఇచ్చేది లేదని లేఖలో ఆమె తేల్చి చెప్పారు. అంతేగాక, ఇతర లంక ఆటగాళ్లు, అంపైర్లు, అధికారులను తమిళనాడుకు పంపవద్దని బీసీసీఐని కోరారు.

రాష్ట్రంలో లంక వ్యవహారంపై తీవ్ర అనిశ్చతి నెలకొని ఉందన్నారు. ఇలాంటి వాతావరణంలో ఐపీఎల్ టోర్నమెంటు రూపంలో లంక ఆటగాళ్ళు చెన్నయ్ లో అడుగుపెట్టడం మంచిదికాదని ముఖ్యమంత్రి జయ హెచ్చ రించారు. ఇప్పటికే తమిళనాడు ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, అందుకే ముందుగా సూచిస్తున్నట్లు తెలిపారు.

ఏప్రిల్ 3 నుంచి ఐపీఎల్ ఆరవ సీజన్ ప్రారంభం కానుంది. 50 రోజుల పాటు జరగనున్న మ్యాచులను దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తారు. ఇందులో 10 మ్యాచు లు చెన్నైలో జరుగనున్నాయి. ఐపీఎల్ లో ఉన్న అన్ని జట్లలో లంక కీలక ఆటగాళ్లు ఉన్నారని జయ లేఖలో పేర్కొన్నారు.  

కాగా, జయ లేఖపై స్పందించిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీష్ తివారీ.. ప్రధానమంత్రి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారని చెప్పారు. లేఖ చదవిన తర్వాత ఆయనే  నిర్ణయం తీసుకుంటారని తివారీ అన్నారు.

  • Loading...

More Telugu News