: రతన్ టాటాకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన సింగపూర్ వర్శిటీ
భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు సింగపూర్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. స్నేహశీలత గల నాయకుడిగా టాటా సాధించిన విజయాలకు గాను వర్శిటీ డాక్టరేట్ తో సత్కరించింది. సింగపూర్ విద్యాశాఖ మంత్రి హెంగ్ స్వీట్ కీట్, సింగపూర్ మేనేజ్ మెంట్ యూనివర్శిటీ అధ్యక్షుడు అర్నాడ్ డి ఈరోజు (సోమవారం) సింగపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో రతన్ టాటాకు ఈ గౌరవ డాక్టరేటును సంయుక్తంగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భారత్ హైకమిషనర్ విజయ్ ఠాకూర్, సింగపూర్ మాజీ అధ్యక్షుడు ఎస్.ఆర్.నాథన్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.