: అక్బరుద్దీన్ శాసనసభ్యత్వాన్ని రద్దుచేయండి
ఎంఐఎం ఎమ్మెల్యే అక్భరుద్దీన్ ఒవైసీ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఇవాళ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. గతేడాది డిసెంబర్ 8వతేదీన నిర్మల్ బహిరంగసభలో అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపధ్యంలో ఈ రిట్ దాఖలైంది. అక్బరుద్దీన్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ జనార్థన్ గౌడ్ అనే న్యాయవాది తాజాగా ఈ రిట్ దాఖలు చేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చట్టవిరుద్దమని గౌడ్ తన వాదన వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసుపై తదుపరి విచారణను ఎల్లుండి వాయిదా వేశారు. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా అక్బర్ పై పలు న్యాయస్థానాల్లో కేసులు దాఖలైన సంగతి విదితమే. కాగా, అక్బర్ ప్రస్తుతం చంద్రాయణ గుట్ట ఎమ్మెల్యేగా ఉన్నారు.
- Loading...
More Telugu News
- Loading...