: తెలంగాణ కోసం కృషి చేసిన ఒక్క కాంగ్రెస్ నేత పేరు చెప్పగలరా?: కేకే సవాల్
తెలంగాణ కోసం కృషి చేసిన ఒక్క కాంగ్రెస్ నేత పేరు చెప్పగలరా? అని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేకే సవాలు విసిరారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీకాంగ్ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. టీకాంగ్ నేతలకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. టీకాంగ్ నేతలు తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయలేరని, జాతీయ పార్టీలదీ అదే పరిస్థితి అని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్ వల్లే సాధ్యమని ఆయన అన్నారు.