: అక్రమంగా అమ్ముతున్న డిఫెన్స్ మద్యం స్వాధీనం
వరంగల్ జిల్లాలో అక్రమంగా విక్రయిస్తున్న డిఫెన్స్ మద్యాన్ని హన్మకొండ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని హన్మకొండ ఎక్సైజ్ సీఐ మీడియాకు తెలిపారు. హన్మకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో డిఫెన్స్ మద్యం అమ్ముతున్నట్టు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది. ఎక్సైజ్ అధికారులు ఆ ఇంటిపై దాడులు జరిపి, రూ. 35 వేల విలువైన 40 ఫుల్ బాటిళ్ల డిఫెన్స్ మద్యాన్ని పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎక్సైజ్ పోలీసులు చెప్పారు. డిఫెన్స్ మద్యం అక్రమంగా కలిగి ఉండటం, అమ్మడం నేరమని సీఐ చెప్పారు.