: 26 దేశాలు, 43 షిప్పులు, 58 విమానాలు... అయినా జాడ లేదు!


కనిపించకుండా పోయిన మలేసియా విమానం ప్రయాణికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. విమానం హైజాక్ కి గురైందన్న అనుమానాలు రోజు రోజుకు బలపడుతుండడం, విమానం ఆచూకీ దొరకకపోవడంతో వారు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలకు సవాలు విసిరిన ఈ ఘటనపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 26 దేశాలు, 43 షిప్పులు, 58 విమానాలు తీవ్రంగా గాలిస్తున్నా ఏ విధమయిన క్లూ దొరకకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందాం... ప్రపంచ దేశాల్లో మేమే గ్రేట్' అని చెప్పుకునే దేశాలు ఏమీ చేయకపోవడంపై వారు నిప్పులు చెరుగుతున్నారు.

విమానం ఆచూకీ దొరకకపోయినా మలేసియా అధికారులు బాధితుల కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ సేకరిస్తున్నారు. విమానం రాడార్ కి చిక్కకుండా భూమికి 5 వేల అడుగుల కంటే తక్కువ ఎత్తులోనే నడిపినట్టు భావిస్తున్నారు. విమానం దారి మళ్లించిన 5 గంటల వరకు గాలిలోనే ఉండడం, మూడు దేశాలపై సంచరించడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఏది ఏమైనా, మలేసియా విమానం అదృశ్యం ఎన్నో పాఠాలు నేర్పుతోంది. మన సాంకేతిక పరిజ్ఞానం ఎంత గొప్పదో తేటతెల్లం చేస్తోంది!

  • Loading...

More Telugu News