: టీఆర్ఎస్ ది దొరల పాలన... కాంగ్రెస్ ది అవినీతి పాలన: రేవూరి
టీఆర్ఎస్ కు ఓటేస్తే దొరల పాలనకు ఓటేసినట్టేనని టీడీపీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో టీఆర్ఎస్ కు 20 సీట్లకు మించి ఒక్క సీటు కూడా రాదని ఆయన సవాలు విసిరారు. ఇక, కాంగ్రెస్ కు ఓటేస్తే అవినీతి పాలనకు ఓటేసినట్టేనని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో 2009 నాటి ఫలితాలే పునరావృతమవుతాయని రేవూరి జోస్యం చెప్పారు.