: రాహుల్ కి ఓటమి తప్పదంటున్న ప్రత్యర్థి
లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి ఓటమి తప్పదని ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ తెలిపారు. అమేథీ గ్రామీణ ఓటర్లను కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమేథీలో చాలా సమస్యలు తన దృష్టికి వచ్చాయని, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సొంత నియోజకవర్గంలో భారీ ఓటమి తప్పదని అన్నారు. 1980 నుంచి గాంధీ కుటుంబ సభ్యులే అమేథీ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్నారని, అయినప్పటికీ సమస్యలు పరిష్కరించలేదని మండిపడ్డారు. శంకర్ గంజ్ గ్రామంలో ఏడేళ్ల క్రితం మొదలు పెట్టిన బ్రిడ్జి నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదని విమర్శించారు. యూపీలో సమాజ్ వాదీ, బహుజన సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ లకు భంగపాటు తప్పదని ఆయన హెచ్చరించారు.