: విజయవాడలో వల్లభనేని వంశీకి ఝలక్
విజయవాడలో తన పట్టు నిరూపించుకోవాలనుకుంటున్న టీడీపీ నేత వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ తగిలింది. విజయవాడ లోక్ సభ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా కేశినేని నాని పేరును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఖరారు చేయడంతో.. విజయవాడ ఎంపీ వంశీకి నిరాశ తప్పలేదు. దీంతో, వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి నాని అభ్యర్థిత్వం దాదాపు ఖరారయినట్టే అని తెలుస్తోంది. వంశీకి ఊరటలా ఆయన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. ఇక విజయవాడ అర్బన్ టీడీపీ అధ్యక్షుడిగా నాగుల్ మీరా ఎంపికయ్యారు.