: జీతం తక్కువైనా పర్లేదు... అక్కడ మాత్రం ఉద్యోగం వద్దు!


ఉద్యోగం అంటే చాలు ఎక్కడికైనా వెళ్లి చేసుకునే ఈ రోజుల్లో, ఢిల్లీలో ఉద్యోగం అంటే మాత్రం యువతులు బెదిరిపోతున్నారు. విదేశాల్లో ధైర్యంగా ఉద్యోగానికో, విద్యనభ్యసించడానికో వెళ్లగలుగుతున్న ప్రస్తుత తరుణంలో ఢిల్లీలో ఉద్యోగం అంటే విముఖత చూపుతున్నారు. దేశ రాజధానికి ఉన్న ట్రాక్ రికార్డుతో మహిళలు అక్కడ అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. జీతం తక్కువైనా పర్లేదు కానీ, ఢిల్లీ కంటే ఇతర నగరాల్లోనే ఉద్యోగం ఉండేలా చూసుకుంటామని 49 శాతం మంది అంటున్నారు.

83 శాతం మంది ఉద్యోగినులు ఢిల్లీలో పగలు మాత్రమే పని చేస్తామంటున్నారు. 9 శాతం మంది పని చేసే వేళలు అనుకూలంగా ఉంటే ఇబ్బంది లేదని అభిప్రాయ పడుతుండగా, 7 శాతం మంది రొటేషన్ పద్ధతి ఉంటే ఇబ్బంది లేదంటున్నారు. తమ స్వస్థలానికి దగ్గరగా ఉండే పట్టణాలైతే సురక్షితంగా ఉంటాయని పలువురు మహిళలు అభిప్రాయపడడం విశేషం. పీహెచ్ డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో ఈ అంశాలు వెలుగు చూశాయి.

  • Loading...

More Telugu News