: ఇళయరాజా పేరిట అభిమాన సంఘం పెడుతున్న కుమారుడు


ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు కార్తీక్ రాజా త్వరలోనే తండ్రి పేరిట అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు చెన్నైలో కార్తీక్ రాజా మాట్లాడుతూ, ఏప్రిల్ 5 న ఇళయరాజా అభిమాన సంఘం ఏర్పాటు కానుందన్నారు. 'ఇసైజ్ఞాని' పేరిట ఇళయరాజా విశేషాలతో కూడిన ఓ వారపత్రికను నడపుతామని తెలిపారు. ఇళయరాజా అభిమాన సంఘం సామాజిక కార్యకలాపాల్లో కూడా పాలు పంచుకుంటుందని చెప్పిన ఆయన, తాము స్థాపించబోయే అభిమాన సంఘం ఇతర నటీనటుల అభిమాన సంఘాల్లా ఉండదని, విభిన్నంగా ఉంటుందని తెలిపారు.

  • Loading...

More Telugu News