: రైల్వే స్టేషన్లో మామ, భార్య పై కాల్పులు


దేశ రాజధాని ఢిల్లీ లోని మెట్రో రైల్వే స్టేషన్లో కాల్పుల శబ్దం విని ప్రయాణీకులంతా హడలిపోయారు. కుటుంబ కలహాల కారణంగా కర్కర్ డుమా అనే వ్యక్తి, అతని మామ.. భార్య మీద కాల్పులు జరిపాడు. వీరు రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్ ఎక్కుతోన్న సమయంలో కర్కర్ కాల్పులకు పాల్పడ్డాడు. కాల్పులకు ఉపయోగించిన డబుల్ బ్యారెన్ గన్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

ఈ కాల్పుల్లో దుండగుడి భార్య చనిపోగా, మామ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ఈ ఉదయం జరిగిన మరో కాల్పుల ఘటనలో బీఎస్సీనేత భరద్వాజ్ చనిపోయిన సంగతి తెలిసిందే.  

  • Loading...

More Telugu News