: కిరణ్ పార్టీకి 'చెప్పు' గుర్తు కేటాయింపు


మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నూతనంగా స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీకి పాదరక్ష గుర్తు కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కిరణ్ స్వయంగా తెలియజేశారు. విశాఖపట్నంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తమ పార్టీ ఎన్నికల చిహ్నం 'పాదరక్ష' అని పేర్కొన్నారు. 'చెప్పు' సమానత్వానికి ప్రతీక అని, కుల, మత, వర్గ భేదాలు లేకుండా అది అందరికీ రక్షణ కల్పిస్తుందని వివరించారు.

  • Loading...

More Telugu News