: హోలీ వేడుకలు చేసుకోని ఆ ముగ్గురు నేతలు


దేశవ్యాప్తంగా ప్రజలందరూ హోలీ సంబరాల్లో మునిగి తేలుతుంటే... ముగ్గురు నేతలు మాత్రం వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇటీవల బాలీవుడ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన గుల్ పనాగ్, మరో నేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లు వివిధ కారణాలతో హోలీ వేడుకలకు దూరంగా ఉన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ తరపున చండీగఢ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్న గుల్ పనాగ్ తనకు ఎంతో ఇష్టమైన హోలీ పండుగకు దూరంగా ఉన్నానని ట్వీట్ చేసింది. నీటి కొరత కారణంగా హోలీ పండుగలో పాల్గొనడం లేదని ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ... సహజసిద్ధమైన రంగులతో హోలీని ఎంజాయ్ చేయాలని ఆమె చెప్పారు.

బీహార్ లో సాంప్రదాయ పద్ధతిలో లక్షలాది మంది హోలీ వేడుకల్లో ఆడి పాడారు. అయితే, సరన్ జిల్లాలో మధ్యాహ్న భోజనం తిని 23 మంది పిల్లలు చనిపోయిన ఘటన తనను కలిచివేసిందని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. అందుకే హోలీ పండుగకు దూరంగా ఉన్నానని ఆయన తెలిపారు. ఇక, ప్రతి ఏటా ధూం ధాంగా హోలీ చేసుకునే లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కారణంగా ఈసారి హోలీ పండుగలో పాల్గొనలేదు.

  • Loading...

More Telugu News