: హోలీ వేడుకల్లో ఆడి పాడిన దానం నాగేందర్
మాజీ మంత్రి దానం నాగేందర్ హోలీ వేడుకల్లో ఆడి పాడారు. హైదరాబాదులో అభిమానులు, కార్యకర్తలు, అనుచరులతో కలిసి వసంతోత్సవంలో మునిగి తేలారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయన హోలీ శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏడాది సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఆహ్వానించి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఆయన అన్నారు.