: బీజేపీ కార్యాలయంలో హోలీ వేడుకలు
హైదరాబాదులోని భారతీయ జనతాపార్టీ (బీజేపీ) కార్యాలయంలో హోలీ వేడుకలు జరిగాయి. బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఒకరిపైనొకరు రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాల్లో మునిగితేలారు. పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు కార్యకర్తలు రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా కార్యకర్తలు సైతం దత్తన్నతో ఆడుతూ రంగేళీలో పాల్గొన్నారు.