: వారణాసి ప్రజలు ఓకే అంటేనే కేజ్రీవాల్ పోటీ
'మోడీపై పొటీ చేయాలని పార్టీ నన్ను కోరింది. దీంతో వారణాసిలో పోటీ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ గెలుపా? ఓటమా? అన్నది ముఖ్యం కాదు. ఈ నెల 23న వారణాసిలో జరిగే ర్యాలీలో పాల్గొంటా. పోటీ చేయాలా? వద్దా? నేరుగా ప్రజలనే అడుగుతా. వారు చేయమంటే చేస్తా, లేకుంటే లేదు' అని ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిన్న బెంగళూరులో చెప్పారు. ఆ పార్టీ నేత మనీష్ సిసోడియా కూడా ఈ రోజు అదే విషయాన్ని మరోసారి చెప్పారు. వారణాసి ప్రజలు అనుమతిస్తే కేజ్రీవాల్ అక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పారు. అందుకోసం ముందు అక్కడ ర్యాలీ జరగనీయండన్నారు.