: పథకం ప్రకారం పెట్టేబేడా సర్దేసిన టీవీ నటి


టీవీ ఆర్టిస్టులను, ఇతర ఖాతాదారులను నిలువునా ముంచిన బత్తుల విజయరాణి పథకం ప్రకారం పది కోట్ల నగదుతో పాటు సామాన్లు కూడా సర్దేసింది. పోలీసు దర్యాప్తు ప్రకారం... ఆమె ముందుగానే టీవీ నటులను, ఇతరులను ముంచేందుకు రంగం సిద్ధం చేసుకుంది. నమ్మకంగా అందరి నుంచి చిట్టీలు వసూలు చేసిన విజయరాణి, ఎల్లారెడ్డిగూడలో ఉన్న అద్దె ఇంటిని ఈ నెల 10న ఖాళీ చేసి, సామాన్లను లారీలో తరలించింది. దీంతో పాటు శ్రీనగర్ కాలనీ, అమీర్ పేటల్లో ఆమె నడిపే మూడు మెస్ లను ఖాళీ చేసింది.

కొడుకు, కోడలితో పాటు బంధువులందరి ఇళ్లకు తాళాలు వేసి ఉండడంతో, పక్కా ప్రణాళికతోనే ఆమె పరారైనట్టు పోలీసులు నిర్థారించారు. అయితే ఆమె ఇంట్లో సామానులు తరలించేందుకు బాడుగకు తీసుకున్న లారీని గుర్తించినట్టైతే ఆమె ఎక్కడ ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుందని పోలీసులు అంటున్నారు. ఆ దిశగా పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News