: నేడు టీడీపీలోకి పలువురు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు
ఎన్నికల నేపథ్యంలో టీడీపీలోకి నేతల వలసల జోరు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పలువురు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు నేడు సైకిలెక్కుతున్నారు. ఈ క్రమంలో దావలూరి దొరబాబు (పెద్దాపురం), తిప్పేస్వామి (అనంతపురం), శంకర్ యాదవ్ (తంబళ్లపల్లి), కుతూహలమ్మ (గంగాధర నెల్లూరు) బాబు సమక్షంలో పసుపు పార్టీలో చేరనున్నారు. మరోవైపు గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. వచ్చే ఎన్నికలో అవకాశం ఇస్తే టీడీపీలో చేరతానని అన్నారు.