: పీఎం రేసులో లేను, యూపీఏను వీడను: శరద్ పవార్
తాను ప్రధాని రేసులో లేనని ఎన్సీపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి శరద్ పవార్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో యూపీఏను వీడే ఆలోచన కూడా లేదని ఆయన తెలిపారు. ఓ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు. 'అత్యధిక సీట్లు గెలిచే పార్టీకే ప్రధాని పదవి దక్కుతుంది. మా పార్టీ 30 స్థానాల్లోనే బరిలో దిగుతుంది. ఏ ప్రాతిపదికన చూసినా పరిమిత సీట్లతో ప్రధాని పదవిని ఆశించడం సరికాదు' అని పేర్కొన్నారు. అయితే, స్థిర ప్రభుత్వం కోసం యూపీఏ, ఇతర సెక్యులర్ పార్టీల మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తానని పవార్ తెలిపారు.