: ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ ను వీడటం లేదు


మెదక్ జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. నేడు ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నారని సమాచారం రావడంతో వెంటనే ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య, దామోదర రాజనర్సింహ, డీఎస్ పలువురు మంతనాలు జరిపి బుజ్జగించారు. అటు ఢిల్లీలోని రాహుల్ కార్యాలయం కూడా నందీశ్వర్ కు ఫోన్ కాల్ చేసి పార్టీ మారొద్దని నచ్చజెప్పారట. దాంతో, కాంగ్రెస్ ను వీడకూడదని నందీశ్వర్ నిర్ణయం తీసుకుని పొన్నాలను కలిసి స్పష్టం చేశారు. దాంతో, కాంగ్రెస్ నేతల రాయబారాలు ఫలించాయి. కొందరు నేతలు తనను ఇబ్బంది పెడుతున్నందుకే పార్టీని వీడాలనుకున్నానని, అంతేకాని కాంగ్రెస్ తనకు కన్నతల్లి లాంటిదని నందీశ్వర్ చెప్పారు. తెలంగాణలో బీసీని సీఎం చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News