: మరోసారి భారత్ సాయం కోరిన మలేసియా
విమానం ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో మలేసియా వర్గాల్లో ఆందోళన నానాటికీ హెచ్చుతోంది. ఈ నేపథ్యంలో గాలింపు చర్యలను తీవ్రం చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు. విమానం ఆచూకీ కనుగొనడంలో 'సాంకేతిక సాయం' అందించాలని కోరారు. దీనిపై మన్మోహన్ సానుకూలంగా స్పందించారు. వీలైనన్ని మార్గాల్లో తమ సాయం అందిస్తామని మలేసియా ప్రధానికి హామీ ఇచ్చారు. కాగా, గాలింపు చర్యలను తాజాగా బంగాళాఖాతానికీ విస్తరించనున్నారు.