: నాన్నా... నాకో సీటు కావాలి


నిజామాబాదు జిల్లాలో కాంగ్రెస్ ముఖ్య నేతలకు వారసుల పోరు ఎక్కువైంది. పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ ధర్మపురి శ్రీనివాస్, మాజీ మంత్రి షబ్బీర్ అలీల తనయులు తమకో సీటు కావాలంటున్నారు. డీఎస్ కుమారుడు సంజయ్ అసెంబ్లీ సీటుపై కన్నేశారు. నిజామాబాద్ అర్బన్ నుంచి రెండు సార్లు పోటీ చేసి పరాజయం పాలైన డీఎస్ ఈసారి నిజామాబాద్ రూరల్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. డీఎస్ కుమారుడు మాత్రం నిజామాబాద్ అర్బన్ స్థానం కావాలని అడుగుతున్నాడు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఎమ్మెల్సీగా మరో ఐదేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉన్నందున... కామారెడ్డి కాంగ్రెస్ టిక్కెట్ తనకే ఇప్పించాలంటూ ఆయన కుమారుడు మహ్మద్ ఇలియాస్ అలీ పట్టుబడుతున్నారు.

  • Loading...

More Telugu News