: జగన్ పై యనమల విమర్శలు
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను కలుషితం చేసేందుకే జగన్ వైఎస్సార్సీపీని ఏర్పాటు చేశారన్నారు. అక్రమాస్తుల కేసులో సీబీఐ నిర్ధారించిన రూ.43వేల కోట్లను ఎక్కడ దాచారో జగన్ చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో జగన్ రహస్య ఒప్పందం నిజం కాదా? అని యనమల ప్రశ్నించారు.