: ఆయుధ పోటీలో చైనా, పాక్ లను వెనక్కినెట్టిన భారత్
సాధించాల్సిన వృద్ధిరేటు ఇంకా ఎంతో ఉందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి చిదంబరం ప్రతి వేదికపైనా నొక్కిచెప్పడం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటూ భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. గత ఐదేళ్ళుగా భారత్ ఈ విషయంలో చైనా, పాక్ లను సైతం వెనక్కినెట్టింది. 2004-08తో పోల్చితే భారత ఆయుధ కొనుగోళ్ళు ఈ ఐదేళ్ళలో 111 శాతం పెరిగాయట.