: అజ్ఞాతంలో ఎంపీ రాయపాటి
ఎంపీ రాయపాటి సాంబశివరావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? వారం రోజులుగా ఎంపీ రాయపాటి ఆచూకీ దొరకడం లేదు. కాంగ్రెస్ అధిష్ఠానానికి విధేయుడిగా ఉన్న రాయపాటి, కావూరికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన సందర్భంగా కాస్త నిరాశకు గురయ్యారు. దీంతో విభజనకు కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ప్రజాప్రయోజనాలు అంటూ పార్టీ అధిష్ఠానానికి ఎదురెళ్లారు. దీంతో యూపీఏకి వ్యతిరేకంగా అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టారు.
విభజన అనంతరం కిరణ్ కుమార్ రెడ్డితో రాయపాటి కలుస్తారని అందరూ భావించారు. అయితే, పార్టీ పెట్టాక కిరణ్ కుమార్ రెడ్డికి ముఖం చాటేశారు. అప్పట్నుంచి ఆయన అందుబాటులో లేకుండా పోయారు. కనీసం ఫోన్ కు కూడా దొరకడంలేదు. దీంతో ఆయన మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయన నిర్ణయం ఏమిటో తెలియక తికమకపడుతున్నారు.