: చేతి గడియారమే మొబైల్ చార్జర్
ప్రయాణంలో ఉన్నాం. చేతిలో స్మార్ట్ ఫోన్ పై వేళ్లు నాట్యమాడుతున్నాయి. చార్జింగ్ పాయింట్ చివరికి వచ్చేసింది. ఇప్పట్లో చార్జింగ్ పెట్టడానికి అవకాశం లేదు. చేతి వేళ్లను కట్టేసుకోలేం ఎలా? ఏం పర్లేదు... కార్బన్ చేతి గడియారం దగ్గరుంచుకుంటే చాలు. ఒక కేబుల్ తో చేతి గడియారం నుంచి స్మార్ట్ ఫోన్ కు పవర్ ఎక్కించుకోవచ్చు. పైగా ఈ చేతి గడియారం సోలార్ ఆధారంగా పనిచేసేది కావడం విశేషం. అంటే ఎప్పటికప్పుడు వెలుతురు ఆధారంగా రీచార్జ్ అవుతూ ఉంటుంది. యూఎస్ బీ ద్వారానూ గడియారాన్ని చార్జ్ చేసుకోవచ్చు. దీన్ని వాటర్, డస్ట్ ప్రూఫ్ గా రూపొందించారు.