: హైదరాబాద్ లో అరాచకం...నిండుచూలాలిపై సామూహిక అత్యాచార యత్నం


దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్ కూడా అత్యాచార రాజధానిగా పేరుతెచ్చుకుంటోంది. నిర్భయ చట్టం కూడా మృగాళ్లలో మార్పు తీసుకురాలేకపోతోంది. తాజాగా హైదరాబాదులో అరాచకం చోటుచేసుకుంది. కన్నూమిన్నూ కానని కామాంధులు నిండు చూలాలిపై అత్యాచార యత్నానికి తెగబడ్డారు. అడ్డం వచ్చిన ఆమె భర్తను కత్తితో పొడిచి మరీ ఈ దారుణానికి ఒడిగట్టారు. మహబూబ్ నగర్ జిల్లా ముంగనూరు నుంచి వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి దంపతులు వచ్చారు.

ఆసుపత్రిలో మూత్రశాల సదుపాయం లేకపోవడంతో మూసీనది సమీపానికి దంపతులు వెళ్లారు. దీంతో కన్నూమిన్నూ కానని ఐదుగురు కామాంధులు అతనిని కత్తితో పొడిచి ఆమెపై అత్యాచారయత్నానికి తెగబడ్డారు. బాధితుడు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తమ పరిధిలోకి రాదంటూ కేసు నమోదు చేసేందుకు పోలీసులు తాత్సారం చేస్తుండడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News