: విమానాశ్రయాల్లో సెక్యూరిటీ సరిగా లేదు: నటి అమందా సేఫ్రీడ్


విమానాశ్రయాల్లో సెక్యూరిటీ సరిగా లేదంటూ హాలీవుడ్ నటి అమందా సేఫ్రీడ్ తాజాగా ఆరోపించింది. విమానం ఎక్కుతూ తాను బ్యాగులో కత్తిని పెట్టి మర్చిపోయానని, అయితే ఎవరూ పట్టించుకోలేదని సెఫ్రీడ్ చెప్పింది. లాస్ ఏంజెలెస్ లో విమాన ప్రయాణ ఘటన వివరాలను ఆమె ట్వీట్ చేసింది. అంతే కాదు, ఆమె ఇంటికెళ్లాక బ్యాగులోని కత్తిని ఫోటో తీసి ట్విట్టర్ లో పెట్టి భద్రతా అధికారుల అలసత్వాన్ని ఎండగట్టింది. ఫ్లయిట్ లో ఎవరేం తీసుకెళ్లినా పట్టించుకోరా? అంటూ సెక్యూరిటీ వింగ్ ను నిలదీసింది. ఈ విషయంపై భద్రతా అధికారులు ఇంకా స్పందించలేదు.

  • Loading...

More Telugu News