: వామ్మో... ఆటో ప్రచారానికి 10 కోట్లా?


ఎన్నికల్లో ప్రచారానికి పలు రకాల పద్దతులు ఎన్నుకుంటారు రాజకీయ నాయకులు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రధాన కూడళ్లలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టడానికి వీలులేకుండా పోయింది. దీంతో నేతలు సరికొత్త దారి కనిపెట్టారు. ఆటోల ప్రచారానికి నాంది పలికారు. పెద్ద ఫ్లెక్సీలు కట్టే అవకాశం లేకపోవడం, నగరంలోని అన్ని ప్రాంతాలకు ఆటోలు తిరిగే అవకాశం ఉండడంతో... ఎన్నికల్లో ఆటో పోస్టర్లతో పెద్దఎత్తున ప్రచారం నిర్వహించేందుకు పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి.

దీంతో ఆటోవాలాల పంట పండింది. ఎన్నికల పోస్టర్ అతికించాలంటే వెయ్యి రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో సుమారు పెద్ద చిన్న నగరాల్లో కనీసం 10 వేల ఆటోల వరకు ఉన్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఆటో ప్రచారం చేసేందుకు సుమారు 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News