: కొత్త పార్టీపై మద్దతుదారులతో అళగిరి భేటీ
తండ్రితో, ఆయన పార్టీతో విభేదించి రెబల్ నేతగా మారి బహిష్కరణకు గురయిన డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి తన మద్దతు దారులతో చెన్నైలో సమావేశమయ్యారు. కొంతకాలం నుంచి తండ్రి కరుణ, తమ్ముడు స్టాలిన్ పై గుర్రుగా ఉన్న ఆళగిరి సొంత కుంపటి పెట్టుకునేందుకు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కొత్త పార్టీ పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్లు వినికిడి. ప్రస్తుతం ఈ విషయంపైనే మద్దతుదారులతో చర్చిస్తున్నారు. భేటీ అనంతరం పార్టీపై ప్రకటన చేసే అవకాశం ఉందని, ఆ పార్టీ నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని సమాచారం.