: యడ్యూరప్ప, శ్రీరాములును ఓడించండి: కేజ్రీవాల్
అత్యంత అవినీతి పరులైన యడ్యూరప్పను, శ్రీరాములును ఎన్నికల్లో ఓడించండని కర్ణాటక ఓటర్లకు ఆప్ అధినేత కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. వీరిద్దరూ గెలిచి, మోడీ ప్రధాని అయితే... మరో భారీ దోపిడీకి తెరలేస్తుందని హెచ్చరించారు. వీరిద్దరూ టెలికాం, మైనింగ్ మంత్రులు అవుతారని... గతంలో లాగానే మళ్లీ దోచుకుంటారని చెప్పారు. ఇలాంటి వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో యడ్యూరప్ప (షిమోగా), శ్రీరాములు (బళ్లారి) బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు.