: సరైన అమ్మాయి కనిపించగానే పెళ్లాడతా: రాహుల్


రాహుల్ గాంధీ ఇన్నాళ్లకు తన పెళ్లి విషయంపై నాలుగు ముక్కలు మాట్లాడారు. పెళ్లెప్పుడు చేసుకుంటారు? అంటూ ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా.. 'ఇదే ప్రశ్న ఎప్పుడూ ఎదురవుతుంటుంది. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల పోరులో ముగినిపోయి ఉన్నా. దురదృష్టవశాత్తూ వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించే సమయం లేదు. తగిన అమ్మాయి తారసపడినప్పుడు చేసుకుంటా' అని చెప్పారు. అయితే, ఏడాదా? లేక రెండేళ్లా? మరోసారి పాత్రికేయుడు ప్రశ్నించాడు. 'ఎప్పుడు సరైన అమ్మాయి కనిపిస్తే అప్పుడే' అని రాహుల్ బదులిచ్చారు. జంతువులంటే ప్రేమ అనీ, జియోగ్రఫీ, రాజకీయాలు, ఫిక్షన్ పుస్తకాలను చదువుతానని ఆయన చెప్పారు. బాలీవుడ్ లో తనకు ప్రత్యేకంగా ఎవరంటే కూడా అభిమానం లేదన్నారు.

  • Loading...

More Telugu News