: చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఇద్దరు లంక ఆటగాళ్లు అవుట్ !


శ్రీలంకలో తమిళుల వ్యవహారం ఐపీఎల్ పై బాగానే ప్రభావం చూపినట్లు కనబడుతోంది. ఐపీఎల్ ఆరవ సీజన్ లో లంక ఆటగాళ్ల భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తమిళనాడుకు చెందిన జట్టు. ఇందులో లంక ఆటగాళ్లు పేస్ బౌలర్ 'నువాన్ కులశేఖర, ఆఫ్ స్పిన్నర్ అఖిల ధనుంజయ్' లు ఉన్నారు. వీరిద్ధరినీ ఐపీఎల్ మొత్తం సీజన్ నుంచి తప్పించాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తోంది.

ఇప్పటికే రెండుసార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. రాష్ట్ర రాజకీయ అనిశ్చితి కారణంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మిగతా జట్లలో కీలక ఆటగాళ్లు కుమార సంగక్కర, లసిత్ మలింగ, ఆంగ్లో మాథ్య్సూ,అజంతా మెండిస్, మహేలా జయవర్థనే ఉన్నారు. వీరున్న జట్లు చైన్నై వేదికగా మ్యాచ్ లు ఆడేందుకు తటపటాయిస్తున్నాయి. 

  • Loading...

More Telugu News