: పేద పోరాట యోధుడు!


ఎన్నికల్లో పోటీ చేయాలంటే ధనబలం నిండుగా ఉండాలి. నోట్లు పంచాలి, ప్రచారానికి కట్టలుగా డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎన్నికలు అంతగా ధనమయమైన రోజుల్లో ఓ నిరుపేద, ఎలాంటి ఆస్తులు లేని వ్యక్తి లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచాడు. బిజు అనే 46 ఏళ్ల సామాజిక కార్యకర్త కొట్టాయం లోక్ సభ స్థానానికి నామినేషన్ వేశాడు. ఇక్కడ ఏప్రిల్ 10న ఓటింగ్ జరగనుంది. బిజు నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో.. తన వద్ద 750 రూపాయలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నాడు. జేబులో 500 రూపాయలు, బ్యాంకులో 250 రూపాయలు. ఇదే ఆయన ఆస్తి. తనకు గానీ, తన భార్య పేరుమీద గానీ ఎలాంటి ఆస్తులు, ఆభరణాలు లేవని తెలిపారు.

  • Loading...

More Telugu News