: నేటి నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీలకు నామినేషన్ల స్వీకరణ
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఈ రోజు నుంచి ప్రారంభమవుతోంది. జడ్పీటీసీ అభ్యర్ధుల నామినేషన్లను ఆయా జిల్లా పరిషత్ కార్యాలయాల్లో, ఎంపీటీసీ అభ్యర్ధుల నామినేషన్లను ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో స్వీకరిస్తారు. రాష్ట్రంలోని మొత్తం 1096 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలకు, 16,589 మండల ప్రాదేశిక నియోజక వర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ప్రతి రోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 24వ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. కాగా అదే రోజు బరిలో ఉన్న అభ్యర్ధుల వివరాలను ప్రకటిస్తారు.