: పవన్ వస్తే బీజేపీలోకి ఆహ్వానిస్తాం: వెంకయ్యనాయుడు
బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం నాయకుడు కూడా లేకుండా పోయారని... కనీసం తమ ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా ఇంత వరకు ప్రకటించలేకపోయిందని అన్నారు. మోడీ ప్రధాని కాగానే బీజేపీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు. ఈ రోజు ఆయన కృష్ణా జిల్లా నందిగామలో పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కేవలం ఓట్లు, సీట్లు కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిందని ఆరోపించారు. పవన్ సహా పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని చెప్పారు.