: శంషాబాద్ ఎయిర్ పోర్టులో మాజీ మంత్రి తనయుడి హల్ చల్
శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రైవేటు బార్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ, అతని స్నేహితుడు ఇంద్రజిత్ దాడి చేశారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న వీరిద్దరూ పుష్పక్ బస్ డిపో కంట్రోలర్ పై కూడా దాడి చేసి వీరంగం సృష్టించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో శంషాబాద్ ఆర్.జి.ఐ.ఎ పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.