: కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులతో కావూరి ఆత్మీయ సమావేశం
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు సమావేశమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఓ కల్యాణ మండపంలో కావూరి ఆత్మీయ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తల అభిప్రాయం తెలుసుకొనేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే, అంతకు ముందు మీడియాతో కార్యకర్తలు మాట్లాడుతూ... కావూరి నిర్ణయమే తమకు శిరోధార్యమని పలువురు అన్నారు. ఈ భేటీ అనంతరం కావూరి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.